ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌లో తప్పులు – సవరణలు చేయని మెదక్ మున్సిపాలిటీపై అభ్యంతరాలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు.

తేది:3-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: తెలంగాణ సర్కార్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తున్నా సందర్బంగా మెదక్ మున్సిపాలిటీలో ఓటర్లు లిస్ట్ లొ తప్పులు వున్నాయని బి ఆర్ ఎస్ నాయకులు మీడియాతో అన్నారు.శనివారం రోజున మెదక్ మున్సిపాలిటీలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు మామిడ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఒక్క వార్డుకు సంబంధించిన ఓటర్లు మరో వార్డులో రావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఆధారా బాదరాగా ఓటర్లు లిస్ట్ చేశారాని ఆరోపించారు.. 2020 లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉన్నటు వంటి ఓటరు లిస్ట్ ప్రకారం ప్రస్తుతం ఓటర్లు లిస్టులను చెయ్యలేదని అన్నారు ముసయిదా ప్రకారం ఓటర్లు లిస్ట్ ను తయారు చెయ్యడంలొ కార్యాలయ సిబ్బందితో పాటు అధికారులను ఫీల్డ్ లోకి పంపించి 2020 ఓటరు లిస్ట్ ఆధారంగా ప్రస్తుత ఓటరు లిస్ట్ జాబితాను డోర్ టు డోర్ తిరిగి పూర్తిగా పరిశీలిస్తే ఓటర్లు లిస్ట్ లొ పొరపాట్లు జరగకుండా వుండేవి అన్నారు. మున్సిపల్ కమిషనర్ మరొక్కసారి ఓటర్లు లిస్ట్ మళ్ళీ తయారు చెయ్యాలని డిమాండ్ చేశారు. 02.01.2026 రోజున నోటీసు బోర్డులో పెట్టిన ఓటరు లిస్ట్ లొ అనేక తప్పులు వున్నాయని అంతే కాకుండా ఆ ఓటరు లిస్ట్ లొ కోన్ని ఓట్లు గత ఎన్నికల్లో ఓక వార్డులో ఉండగా ఓటరు లిస్టులో ఇంటి నెంబర్ లను వేరే వార్డు ఓటరు లిస్టులో చూపిస్తానాయని ఇబ్బందులు తోలగాలంటే కార్యాలయ సిబ్బంది. అధికారులు అందరు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి గతంలో జరిగిన వార్డుల విభజన ఇంటి నెంబర్ ఆధారంగా ఓటరు లిస్టును తయారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *