తేది:03-01-2026 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జిఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.నేటి తరం యువతను ప్రోత్సహించేలా ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిలో వ్యాయామంపై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. యువత పెడదారి పట్టకుండా క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు.పటాన్చెరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనబోతున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.