


తేది:03-01-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని డిటిసి శోభన్ బాబు తెలిపారు.జాతీయ రోడ్డు భద్రత మహోత్సవ వారోత్సవాల సందర్భంగా రోడ్డు రవాణా శాఖ కార్యాలయం,వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.అనంతరం మీడియాతో ట్రాఫిక్ సిఐ సుజాత మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను అరికట్టి తమ జీవితాలను నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డుపై రవాణా కొనసాగించే సమయంలో జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు.ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.