కొవీఢ్19 వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో 20 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్‌డౌన్‌ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగినా దానిని కేంద్ర కొట్టిపారేసింది. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 15న లాక్‌డౌన్ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా..? అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టుపై వెలువరించింది.