వికారాబాద్ లో ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి.

తేది:03-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పీరంపల్లి లో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు కూరా సంగమేశ్వర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 195 జయంతి సందర్భంగా భారతీయ సంఘసంస్కర్తగా, మొదటి ఉపాధ్యాయురాలిగా అనేక సేవలు అందించిందని ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది అని వారు అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని వారు ఆకాంక్షించారు. అలాగే మండలంలోని చాలా పాఠశాలలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీమతి రుక్మిణి గారు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *