పెనుబల్లి మండలంలోని గణేష్ పాడు వద్ద ఎన్ఎస్పి కాలువలో బోల్తాబడిన స్కూల్ బస్సు- పలువురిని కంటతడి పెట్టించిన ఘోర రోడ్డు ప్రమాదం.

తేది:02-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరు మండల రిపోర్టర్ మహమ్మద్.బురహానుద్దీన్.

ఖమ్మం జిల్లా: పెనుబల్లి మండలం లోని గణేష్ పాడు వద్ద ఎన్ ఎస్ పి కాలువ లో బోల్తా పడి న,స్కూల్ బస్. ఈ ప్రమాదం లో సుమారు 40మందిగాయ పడ్డారు. వేంసూరు మండలం లోని శ్రీ వివేకానంద స్కూల్ బస్. డ్రైవర్ 120మందిని, ఎక్కువ మందిని బస్ లో ఎక్కించు కొని, మద్యం సేవించి నడుపుతూ కాలువ వద్ద కు రాగానే బస్ అదుపుతప్పి కాలువ లోకి దూసుకెళ్లడం తో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం లో గాయ పడిన వారిని తిరువూరు, పెనుబల్లి, ఆసుపత్రి ల లో 108వాహనాలద్వారా తరలించి చికిత్స చేయించి నారు. డ్రైవర్, మద్యం సేవించి బస్ నడిపినందున అతని పై చర్యలు తీసుకోని, న్యాయం చేయాలనీ, మాజీ శాసన సభ్యులు. సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా, గాయాలు, పాలైన పిల్లలు, కోలు కుంటున్నారు. ఈఘోరరోడ్డు ప్రమాదం పలువురిని కంట తడి పెట్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *