నటి రష్మిక మందన్నా తన డీప్‌ఫేక్ వీడియోపై మరోసారి స్పందించారు. రష్మిక నటించిన ‘యానిమల్’ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రొమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రష్మిక మాట్లాడారు. తన ఫేక్ వీడియో చూసి తొలుత చాలా బాధపడినట్లు చెప్పారు. ఏం చేయగలం అనిపించిందని.. ఆ తర్వాత దీన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నట్లు తెలిపారు.