పోచమ్మరాల్ తండా నుండి పల్లె వెలుగు బస్సు సౌకర్యం కల్పించాలి, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు వృద్ధులు వికలాంగులు అవస్థలు.

తేది:02-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: నేషనల్ హైవే రోడ్డు విస్తరణలొ భాగంగా మా తాండకు బస్సులు రావడం లేదూని హవేలీ ఘనపూర్ మండలం పోచమ్మరాల్ తండా వాసులు బస్సులు రాక మోర పెట్టుకున్నారు. హవెలి ఘనపూర్ గ్రామపంచాయతీలో ప్రతీ నిత్యం ఉద్యగులు విద్యార్థులు కాలేజ్ స్టూడింట్స్ వ్యాపారస్థులు మెదక్ టౌన్ కు వెళుతుట్టురాని మీడియాకు తెలిపారు గ్రామపంచాయతీ సర్పంచ్ రాజు మాట్లాడుతూ మెదక్,కామారెడ్డి సరిహద్దులోగల మారు మూల ప్రాంతమైన పోచమ్మ రాల్ గ్రామపంచాయతీ తాండ నుండి మెదక్,ఎల్లారెడ్డి,గోపాల్ పేట,బాన్సువాడ,బోధన్ వెళ్లే పల్లె వెలుగు బస్సులను మా గ్రామ పంచాయతీలోని తండా నుండి పల్లె వెలుగు బస్సులను పంపాలని మెదక్ డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చినా కూడా వారు పట్టించు కోకపోవడంతో మా పోచమ్మ రాల్ గ్రామపంచాయతీలో గల రైతులు కూరగాయలు పండించుకొని కూరగాయల మార్కెట్ లు గోపాల్ పేట,మెదక్ కు తీసుకెళ్లాలంటే రవాణా సౌకర్యాలు లేక తల్లుడిల్లుతున్నామని గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నామని వారు తెలిపారు.అలాగే మా తండా ప్రక్కన నుండి హైవే రోడ్డు మీదుగా బస్సులు వెళ్తాయి. కానీ మా గ్రామ పంచాయతీ వద్ద బోర్డు,రవాణా స్టాప్ లేదంటూ ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో మేము తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నామని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ రాజు,ఉప సర్పంచ్ శ్రీను,వార్డు మెంబర్ల తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *