హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తప్పు చేశారని… తనకు ఫోన్ చేసి ‘మన్సూర్.. ఏం జరిగిందో చెప్పు’ అని తెలుసుకుని ఉంటే బాగుండేదన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి వెయ్యి కోట్లు సంపాదించారని అన్నారు. చిరంజీవిపై రూ.20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై రూ. 10 కోట్ల చొప్పున పరువునష్టం దావా వేస్తానన్నారు. ఈ డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తానన్నారు.