యువత ఉత్సాహానికి క్రీడలే బాట – 31వ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో మాద్రి పృథ్వీరాజ్.

తేది: 01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిరంజన్ లెవెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 31వ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు, పటాన్‌చెరు సీనియర్ నాయకుడు గూడెం మధు సుధన్ గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు విజేత జట్లకు శుభాకాంక్షలు తెలియజేసి ట్రోఫీలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, యువతలో క్రీడా ప్రోత్సాహం ఎంతో అవసరమని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పేర్కొన్నారు. ఇటువంటి టోర్నమెంట్లు యువతను ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కేక్ కట్ కార్యక్రమంలో కూడా పాల్గొని, క్రీడాకారులు, నిర్వాహకులు, ప్రేక్షకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. సమూహ కార్యక్రమాల ద్వారా సామాజిక అనుబంధం మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *