


తేది:01-01-2026 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ ను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం, వైద్య సేవల విస్తరణపై స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం. నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆకాంక్షిస్తూ ఇరువురు నాయకులు పరస్పర శుభాకాంక్షలు పంచుకున్నారు.
ఈ సమావేశం నూతన సంవత్సర ఆరంభంలో ప్రజాసేవ పట్ల నాయకుల కట్టుబాటును ప్రతిబింబించిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.