నూతన సంవత్సరానికి ప్రార్థనలతో స్వాగతం – అమీన్పూర్ జవహర్‌నగర్‌లో శాంతి సందేశం.

తేదీ: 01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా : అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని జవహర్‌నగర్ కాలనీలో ఉన్న క్రీస్తు విశ్వాసుల ప్రార్థన మందిరంలో నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు పాల్గొని, సమాజంలో శాంతి, ఐక్యత, సర్వాంగ అభివృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా పాస్టర్ ప్రకాష్, శ్రీకాంత్, పలు బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో జీవించాలని ఆశీర్వచనాలు అందించారు. పరస్పర గౌరవం, సామరస్యం, మానవీయ విలువలు మరింత బలపడాలని వారు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చుక్క రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ యాదవ్, రాములు తదితరులు పాల్గొని, సమాజంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి కోసం తమ ప్రార్థనలను సమర్పించారు. నూతన సంవత్సరానికి ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ ప్రార్థన సమావేశం ప్రజల మధ్య సౌహార్దాన్ని పెంపొందిస్తూ, శాంతి సందేశాన్ని బలంగా చాటిందని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *