జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి.

తేది: 01-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: హవెలిఘనపూర్ గ్రామ ఉప సర్పంచ్ వడ్ల.రాజు జన్మదిన వేడుకలు గురువారం హవెలిఘనపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదినం వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొని మండల నాయకులతో కలసి ఉప సర్పంచ్ రాజతో కేక్ కట్ చేయించి తినిపించే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…గ్రామ పాలకవర్గం మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని సూచించారు. ఇప్పుడు ఉన్నది ప్రతిపక్ష పార్టీలో అయినా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. నిరంతరం గ్రామంలో తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తూ,గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ వార్డు సభ్యులకు సూచించారు. ఇందుకు తమ వంతు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.ఈ సందర్బంగా మండల నాయకులు పద్మ దేవేందర్ రెడ్డి గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలోహవెలిఘనపూర్, గ్రామ సర్పంచ్ మేకల సాయిలు, వార్డు సభ్యులు లావణ్య, దండు స్వప్న, కమ్మరి ఆంజనేయులు, రాణి, గణపతి,బత్తుల వెంకటేశం, కుర్మ అంజమ్మ, మన్నె శ్రీనివాస్, ఎర్ర దేవయ్య,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజా గౌడ్, నాయకులు కొత్తపల్లి. కిష్టయ్య, రామచంద్రారెడ్డి, కిష్టయ్య, కుర్మ పోచయ్య, లక్ష్మీనారాయణ, మోహన్ గౌడ్,సత్యం గౌడ్,నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సిద్దు, ఎల్లప్ప, అజయ్, వడ్ల. నాగరాజు, నల్ల రాజు, రమేష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *