



తేది: 01-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ:
2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో జిల్లా అధికారులు మరియు ఉద్యోగస్థులు పరస్పర సహకారం తో విజయవంతం అయ్యామని తెలిపారు.అదే ఉత్సాహంతో 2026 సంవత్సరంలో కూడా పనిచేసే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.అందరు యోగ, వ్యాయామం, ఉదయం నడక చేయాలని ప్రతిరోజు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కొత్త సంవత్సరంలో అందరికి శుభం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆయా రంగాల్లో మరింత ఉన్నత స్థానాలకు ఆశించారు.ఈ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధు సూదన్, జీవాకర్ రెడ్డి, జెడ్పి సి ఈ వో గౌతమ్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి, జిల్లా అధికారులు, ఉద్యోగస్థులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.