అమెరికా ప్రభుత్వం ప్రతిభావంతులకే తమ విద్యాసంస్థల్లో అవకాశం కల్పిస్తుంటుంది. కానీ, నాణ్యమైన విద్య, ఉపాధి లభిస్తుందన్న కారణంగా అనేక దేశాల విద్యార్థులలాగానే భారత్ నుంచి కూడా ఏటా పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలివెళుతుంటారు. అయితే స్టూడెంట్ వీసాల కోసం అమెరికా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఎమ్, ఎఫ్, జే కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు మారిన నిబంధనలను గమనించాలని, కొత్త నిబంధనలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.