తేదీ:31-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా : మెదక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత బైక్ రేసింగ్, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.