
తేది:31-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా :గణపురం మండలం ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ ను బుధవారం భూపాలపల్లి జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలు చిట్యాల జయశ్రీ , టేకుమట్ల అనిత, మొగుళ్ళపల్లి జి సురేందర్, కాటారం ఎ బాబు, గణపురం లంకపల్లి భాస్కర్ ఎంపీడీవో ల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఎంపీడీవోల బృందాన్ని కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.