మొన్న రష్మిక.. నిన్న కత్రినా .. నేడు ఆలియా.. డీప్ ఫేక్ వీడియోస్ కలకలం ..

సినీ ఇండస్ట్రీ అంటే హీరోయిన్లకు పలు రకాల డ్రస్సులు వేసుకోక తప్పదు. మరీ రొమాంటిక్ సీన్స్ లో నటించేవారు వీలైనంత తక్కువ బట్టలే వేసుకుంటారు. కానీ ఎవ్వరు కూడా వారి పరిధిని దాటి ప్రవర్తించిన సంఘటనలు అయితే లేదు. కానీ గత కొద్ది కాలంగా ఏఐ టెక్నాలజీ చేతికి అందింది కదా అని ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొంచెం క్యూట్ గా ఉన్న హీరోయిన్స్.. కాస్త పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్స్.. ఇలా ఎవరిని వదలకుండా తమకు నచ్చినట్టు డీప్ ఫేక్ వీడియోస్ చేసి వైరల్ చేస్తున్నారు.

 

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ మనకు కలిగించే లాభాలే కనిపిస్తున్నాయి కానీ ఇలాంటి కొన్ని సందర్భాలలో వాటి వల్ల వచ్చే నష్టాలు అర్థం అవుతున్నాయి. కొంతమంది టెక్నాలజీని వాడుకొని అభ్యంతరకరమైనటువంటి వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. సెలబ్రిటీల ఫేస్‌లను మార్ఫింగ్ చేసి వాళ్లు విడుదల చేస్తున్న వీడియోలు మనస్థాపం కలిగించే విధంగా ఉన్నాయి. సెలబ్రిటీలను టార్గెట్ చేసిన ఏఐ కేటుగాళ్ల పై ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని శిక్షలు విధిస్తోంది. అయినా సరే వాళ్ళు ఏమాత్రం జంకడం లేదు.

 

రీసెంట్గా రష్మిక కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హడావిడి చేసింది. లాస్ట్ కి అది ఫేక్ వీడియో అని తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సినీ ఇండస్ట్రీ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయంలో రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. ఆ తర్వాత కత్రినా కూడా ఇదే రకమైన ఫేక్ వీడియో బారిన పడింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు చొరవ తీసుకోవడంతో ఇకనైనా ఇవి తగ్గుతాయి అని అందరూ ఆశించారు. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న అలియా భట్ ఈ ఫేక్ వీడియో కి చిక్కింది.

 

అలియా భట్ ఫేస్‌ని యాడ్‌ చేసి అభ్యంతరకరంగా ఉన్న ఒక వీడియోని నెట్ ఇంత వైరల్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క అలియాకి సపోర్ట్ గా నిలబడుతున్న ఆమె అభిమానులు ఇటువంటి వీడియోలు చేసే వారిపై దుమ్మెత్తి పోయడంతో పాటు, కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు జరగకుండా తగు నిబంధనలు తీసుకురావలసిన అవసరం ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *