ఐకానిక్ గ్లోబల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు.

తేది:31-12-2025 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.

సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరువు నియోజకవర్గం వడకపల్లి గ్రామం ఐకానిక్ గ్లోబల్ స్కూల్‌ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఐకానిక్స్ ఎక్స్లె లెన్స్”ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను అత్యంత సృజనాత్మకంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.ప్రత్యేకంగా కోర్ట్ రూమ్ కాన్సెప్ట్, స్పేస్ రూమ్,తెలుగు స్పెషల్ విభాగం,మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ఈ ప్రదర్శనలు విద్యార్థుల ఆలోచనా శక్తిని, సామాజిక అవగాహనను ప్రతిబింబించాయి.ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు విద్యార్థుల ప్రతిభను ఆస్వాదిస్తూ, కార్యక్రమ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన డైరెక్టర్ కార్తిక్ నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా సాగిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో  స్కూల్ యాజమాన్యం,విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *