తేది:31-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పలు సూచనలు చేశారు.డిసెంబర్ 31న జిల్లాలో డీజేలు నిషేధించబడ్డాయి.నిబంధన లను ఉల్లంఘిస్తే పరికరాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తాం.మద్యం సేవించి వాహనం నడపడం నేరం,వేగంగా నడిపితే కేసులు నమోదు చేసి జైలుశిక్ష విధిస్తారు.ఆస్తుల ధ్వంసం, మహిళలపై అసభ్య ప్రవర్తనకు కఠిన చర్యలు,ఇళ్లపై రాళ్లు విసిరినవారిపై, ప్రైవేట్ ఆస్తులు, వీధి దీపాలను ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్ నిషేధం,బైక్ రేసింగ్ లేదా ముగ్గురు కలిసి ప్రయాణించిన వారిపై కేసులు నమోదు చేస్తారు.మాదక ద్రవ్యాలు, నిషేధిత మద్యం విక్రయాలపై చర్యలు,గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేయాలి.- మైనర్లకు మద్యం అమ్మకాలు చేయరాదు.ప్రభుత్వ ప్రాంగణాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో మద్యం అమ్మిన వారిపై కేసులు నమోదు చేస్తారు.పై నిబంధనల ఉల్లంఘన కనిపించిన వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని సూచించారు..