
తేది:31-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మంజూరైన మహిళా సంఘం భవనం నిర్మించుటకై గ్రామ సర్పంచ్ పోషల వెంకన్న ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేసి , నూతన భవన నిర్మాణానికై స్థలాన్ని కేటాయించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచి వెంకన్న మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా మహిళల కోసం నూతన భవన నిర్మాణం కై సంతకం చేయడం జన్మ ధన్యమని, గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మహిళల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయaతీ కార్యదర్శి బానోత్ కిషోర్, గ్రామ కారోబార్, తాళ్లపల్లి ఎల్లయ్య, గంగారపు సంజీవ, వంగాల సోమయ్య, గిరగాని,సుధాకర్, వంగాల వెంకటమ్మ, తాళ్లపల్లి రేణుక, బేతి మౌనిక తదితరులు పాల్గొన్నారు.