

తేది:30-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS
అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మండలంలోని అల్లాదుర్గం, గడి పెద్దాపూర్,ముస్లాపూర్ వెంకటేశ్వర ఆలయాలలో భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుండి మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని పురాతన ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రవీణ్ శర్మ వేదమంత్రోత్సవాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం ద్వారా వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలను సుందరంగా అలంకరించారు. గడి పెద్దాపూర్ వెంకటేశ్వర ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడింది. హరినామ గోవింద నామస్మరణతో భక్తులు ఉత్తరధార దర్శనం చేసుకుని భక్తి పరవశంలో మునిగితేలారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యఫలం అని, సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎంతో పవిత్ర దినమైన ఏకాదశి పురస్కరించుకొని భక్తులు ఉపవాస దీక్షలు చేసి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి శేషారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి, సీనియర్ నాయకులు సుభాష్ రావు, దుర్గా రెడ్డి, సుధాకర్ గుప్తా, బచ్చు రమేష్, ప్రసాద్, సాయిలు గౌడ్, తో పాటు ప్రముఖులు, వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.