

తేది:30-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ :నూతన సంవత్సరం సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చిన అదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ పహడ్ షరీప్ వద్ద చేపట్టి తనిఖీల్లో 229 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పహడ్ షరీఫ్ రహదారిలో ఎయిర్ పోర్టు నుంచి, గోవా, ఢిల్లీ , హర్యానా ప్రాంతాలకు సంబంధించిన మద్యాన్ని తెలంగాణకు తీసుక వస్తున్నారనే సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్.ఎస్టీఎఫ్ బీ టీమ్,సరూర్నగర్, మహేశ్వరం ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గోన్నారు.
పట్టుకున్న మద్యం బాటిళ్లను సరూర్నగర్ క్సైజ్ స్టేషన్కు అప్పగించారు. సంగారెడ్డి ప్రధాన రహదారిలో చేపట్టిన తనిఖీలు గోవా ప్రాంతం నుంచి దిగమతి అవుతున్న 7.165 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకన్నారు.