తేదీ:30-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి.పాపయ్య చారి.
మెదక్ జిల్లా : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ సంబంధిత అధికారులు పాటించడం లేదని మండల పరిధిలోని చేవెళ్ల గ్రామ సర్పంచ్ మచ్చందర్ సోమవారం తాసిల్దార్ మల్లయ్య కు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలు లో గ్రామ సర్పంచు అయినా తనతో కాకుండా ఏలాంటి ప్రోటోకాల్ లేని నాయకునితో తమగ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు అధికారిక కార్యక్రమాలలో హల్చల్ చేస్తున్న, చెక్కులు పంపిణీ చేస్తున్న అధికారులు చూస్తూ చూడనట్లు ఉండడం ఏమిటని . ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ పదవిలో ఉన్న తమలాంటి వారిని అగౌరపరిచారని, దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరల ఇలాంటి తప్పిదం జరగకుండా మండల అధికారులు ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లె గడ్డ నరసింహులు అప్పాజీపల్లి సర్పంచ్ రవి, నాయకులు సూర్యకుమార్, చేవెళ్ల ఉప సర్పంచ్ నాగన్న సిహెచ్. సంగమేష్, శ్రీశైలం, కుమార్, శ్రీశైలం తదితరులున్నారు.