
తేది:30-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివ్పేట్ మండల్ గ్రామం వెంకటాపూర్ రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య.
సంగారెడ్డి జిల్లా: వైకుంఠ ముక్కోటి ఏకాదశి సదాశివపేట్ మండల్ గ్రామం వెంకటాపూర్ శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రం స్వయంభు అద్భుత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి స్వామి ఆలయం ఉత్తర ద్వార దర్శనం ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా వెంకటాపూర్ గ్రామం కు బారులు తీరిన భక్తులు వైకుంఠ పర్వదినాన ముక్కోటి దేవతల సమేతంగా గరుడ వాహనం దర్శనం ఇచ్చే వెంకటాచల క్షేత్రమును దర్శించుకున్నారు భక్తులు. భక్తులకు సౌకర్యార్థం సదాశివపేట గాంధీ చౌక్ నుండి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ భక్త బృందం అధ్యక్షులు చివరి వెంకటేశం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి పరమపుణ్యప్రదం,వైకుంఠనాథుని దర్శనం శుభప్రదం అని ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్ర పర్వదినం, కోటి పుణ్యాలకు నెలవైన రోజే ముక్కోటి ఏకాదశి అని కొనియాడుతూ ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శ్రీ మహావిష్ణువు దీవెనలతో అందరూ ఆయురారోగ్యాలు,సిరిసంపదలు,సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంలో భరతనాట్యం మాలి పటేల్ ప్రభు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.