
తేదీ:30-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: సోమవారం నాడు మెదక్ జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో స్వీకరించిన దరఖాస్తులు, సంబంధిత రికార్డులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే మీసేవ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు సకాలంలో, పారదర్శకంగా జరుగుతున్నాయా అనే విషయాన్ని అక్కడికి వచ్చిన ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సేవల అమలులో జాప్యం జరగకుండా అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.