తేదీ:29-12-2025 TSLAW NEWS హైదరాబాద్ ఇన్చార్జ్ విజయ మురళి కృష్ణ.
హైదరాబాద్,కూకట్పల్లి: మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2025 సంవత్సరాంత వేడుకలు మరియు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ కార్యక్రమంలో డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవాని కి ప్రతిష్టాత్మకమైన
పీఎం మోడీ విజన్ ఆఫ్ భారత్ అవార్డు – 2025
భారత్ బిజినెస్ అచీవర్స్ నేషనల్ అవార్డు – 2025 లను ఘనంగా ప్రదానం చేశారు.
ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా, అలాగే మానవ హక్కులు మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో, పత్రిక రంగంలో ఆమె అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ జాతీయ అవార్డులు అందజేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజ అభివృద్ధే తన లక్ష్యమని, ముఖ్యంగా మహిళలు, యువత ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ అవగాహన కీలకమని పేర్కొన్నారు. అలాగే వారాహి వెల్త్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫౌండర్ )ద్వారా అనేక మందికి పార్ట్ టైమ్ మరియు ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సేవలందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ఆమె సేవలను ఘనంగా ప్రశంసించారు.