అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. శ్రీలీల కోరికలు వైరల్..

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో సైతం శ్రీలీల హీరోయిన్. నితిన్ కి జంటగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రాలపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం చిత్రాల్లో ఏది విజయం సాధించినా శ్రీలీల కెరీర్ మరో లెవెల్ కి చేరుతుంది. శ్రీలీల డాన్సులు, ఆమె ఎనర్జీకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

 

ఇదిలా ఉండగా శ్రీలీల తనకు కాబోయే భర్త ఎలా ఉండాలోట్ తెలియజేసింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు కాబోయేవాడు అందగాడు అయ్యి ఉండాలి. అలాగే కుటుంబానికి విలువ ఇచ్చేవాడు కావాలి. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. తన జోక్స్ తో నవ్వించాలి. కొన్నిసార్లు నన్ను భరించడం అంత సులభం కాదు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించేవాడు భర్తగా కావాలి… అని శ్రీలీల హింట్ ఇచ్చింది.

 

శ్రీలీల ప్రస్తుత వయసు 22 ఏళ్ళు. ఇంకా చదువుకుంటుంది. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. నందమూరి ఫ్యామిలీకి శ్రీలీల చాలా దగ్గరయ్యారు. భగవంత్ కేసరి మూవీలో బాలకృష్ణ, శ్రీలీల నటించారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. శ్రీలీల నందమూరి ఇంటి కోడలు కావొచ్చు. మోక్షజ్ఞ ఆమెను వివాహం చేసుకోనున్నాడనే రూమర్స్ వినిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *