ఏపీలోని కాకినాడలో వైసీపీ నేతల భూదాహమే వైద్యుడిని బలితీసుకుందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘కన్నబాబు తమ్ముడి దౌర్జన్యాలు భరించలేకే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. భూధ్రువపత్రాలు తనవద్దే ఉంచుకుని శ్రీకిరణ్‌ను వేధించారు. వైద్యుడు శ్రీకిరణ్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. బాధితులంతా కలిసి వైసీపీ నేతల దందాలు, కబ్జాలను ఎదిరించాలి’ అని లోకేశ్ అన్నారు.