ఫామ్‌హౌజ్‌లో పడుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. “తెలంగాణ నిధులను నీళ్లు, నిధుల పేరు చెప్పి కేసీఆర్ కుటుంబం దోచుకుంది. తెలంగాణను లూటీ చేశాక కేసీఆర్ దృష్టి దేశంపై పడింది. అందుకోసమే ఢిల్లీలో ఒక నేతతో చేతులు కలిపి.. మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యాప్తు జరుగుతోంది.” అని ప్రధాని వెల్లడించారు.