తెలంగాణలో ప్రధాని మోడీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. ములుగు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించలేక గిరిజన, గిరిజనేతరుల మధ్య బీఆర్ఎస్ వివాదం సృష్టిస్తోంది. కేసీఆర్ను గద్దె దించాలంటే బీజేపీని గెలిపించండి. కాంగ్రెస్ వాళ్లను గెలిపించినా మళ్లీ బీఆర్ఎస్ గూటికే చేరుతారు.” అని అమిత్ షా పేర్కొన్నారు.