వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కార్లు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్‌లోని టెస్లా కార్లు దిగుమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. ఈ క్రమంలో జనవరిలో జరిగే వెబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఎలాన్ మస్క్ భారత్‌కు రానున్నారు.