
తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాలజిల్లా ఇంచార్జి
ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 4.30 గుండెపోటు రావడంతో హఠాత్తుగా మృతి చెందడం పట్ల జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వైద్య ఆరోగ్యశాఖ, వైద్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో పనిచేస్తూ, బాధ్యతాయుత అధికారిగా మంచి గుర్తింపు పొందిన డా.శ్రీనివాస్ మరణం జగిత్యాల జిల్లా వైద్య శాఖకు తీరని లోటుగా వారు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఈ విషాద వార్త వెలువడగానే జిల్లా అధికారులు, వైద్య విభాగ సహచరులు, మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు అధికారులు భావోద్వేగానికి లోనయ్యారు.
సేవాభావంతో, మానవీయ విలువలతో విధులు నిర్వహించిన వ్యక్తిగా డా. శ్రీనివాస్ ఎప్పటికీ గుర్తుండిపోతారని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు వైద్య ఆరోగ్యశాఖ, మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.