ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

తేదీ:26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం గణపురం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో 75 మంది లబ్ధిదారులకు 75 లక్షల పైగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని కళ్యాణ్ లక్ష్మి పథకం వల్ల పేదింటి ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ అండగా నిలుస్తుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో లంకపెళ్లి భాస్కర్, గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *