తేది: 26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా : గణపురం మండలం నగరంపల్లి రైతులు నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరంపల్లి సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ అన్నారు. శుక్రవారం నగరంపల్లి గ్రామంలో గొర్రెలు మేకల మందలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని నగరంపల్లి గ్రామ సర్పంచ్ కోడారి హైమావతి – ధనుంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొర్రెలు మేకలకు ప్రతి సంవత్సరం మూడుసార్లు నట్టల నివారణ మందు త్రాగించాలని సూచించారు. పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నట్టల నివారణ మందుల వల్ల గొర్రెలు మేకలలో నట్టలను సమూలంగా నిర్మూలన జరుగుతుందని అదేవిధంగా జీవాలలో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి మరణాల శాతం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవులు కురుమలు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.