
తేది:26-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా : ఈరోజు పాపన్నపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్‌తో పాటు ఓపీ రిజిస్టర్‌ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహిస్తున్నారా? రోజువారీగా ఎంతమంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారన్న అంశాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను కలెక్టర్ నేరుగా ఆరా తీసి, వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే లక్ష్యమని, అందుకు వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.