ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపై మాజీ ఆటగాడు కపిల్ దేవ్ మరోసారి స్పందించారు. ‘నేటి క్రికెటర్లు వన్డే ప్రపంచప్‌ను గెలవలేకపోయారు. అయితే వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవకపోవడం నన్ను కూడా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ఎందుకంటే చివరి వరకూ అద్భుతంగా ఆడినా కప్‌ను సాధించలేదనే బాధ ఇప్పటికీ ఉంది’ అని పేర్కొన్నారు.