ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో జనగామ జిల్లా ముందంజ,సాకర మవుతున్న పేదల కలలు,క్షేత్ర స్థాయి లో స్పష్టమైన పురోగతి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

తేదీ 26-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker.

జనగామ జిల్లా: నిరుపేద లకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పంతో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా జిల్లా లో లబ్ధిదారులకు మంజూరు అయిన ఇళ్ల ను వేగవంతంగా నిర్మాణం అయ్యేలా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక శ్రద్ద వహించడంతో నేడు,మంజూరు అయిన ప్రతీ ఇళ్ళు.నిర్మాణం లో వివిద దశల్లోసాగుతు న్నాయి.మంజూరు అయిన ఇళ్లను త్వరగా గ్రౌండింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి లో జిల్లా ను ప్రధమ స్థానం లో నిలబడేం దుకు చేసిన కృషిజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంత ఇళ్ల కల నెరవేర్చడం కోసం పక్క కార్యాచరణతో ముందు కెళ్ళాము.నిరుపేద లకు మాత్రమే లబ్ది చేకూరెలా, అర్హులైన వారిని ఎంపిక చేయడం నుండి మెదలు మంజూరు అయిన ప్రతీ ఇళ్ళు నిర్మాణ దశ లోకి వచ్చేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను తూ. చ తప్పకుండ అమలు చేశాము.ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి,గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి.పలుమార్లు రివ్యూ లు చేయడం తో పాటు లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యల వల్ల నేడు రాష్ట్ర స్థాయి లో గ్రౌండింగ్ లో జిల్లా ప్రధమ స్థానం లో నిలబడింది
నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేయడం తో పాటు పథకం ప్రారంభించినప్పటి నుండి.. మండల స్పెషల్ అధికారులను, తహసీల్దార్ లను, సంబంధిత శాఖ అధికారులను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిశీలన కు పంపడం వల్ల మంజూరు అయిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం గా అయ్యాయి.ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం పనులు చేపట్టడానికి, ఇందిరమ్మ కమిటీల సహకారం కూడా దోహద పడిందన్నారు
జిల్లా ల్లోరెండు విడతల్లో5834 ఇళ్ళుమంజూరు కాగా
ఇప్పటివరకు 5206 ఇళ్ళు నిర్మాణ దశ లో ఉండగా33 ఇళ్ళు పూర్తి అయ్యాయి.
4499 మంది లబ్ధిదారులకు వివిధ దశల వారీగా డబ్బులు పడ్డాయి.ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ పథకం ప్రతీ గడప కు చేరేలా పక్క కార్యాచరణ రూపొందిస్తూ వివిధ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయడంతో పాటు.. క్షేత్ర స్థాయి లో కూడా పక్కాగా అమలు అయ్యేందుకు… నిరంతర పర్యవేక్షణ మూల కారణమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *