గ్రూప్2, గ్రూప్3 ఉద్యోగాలు సాధించిన యువతకు ఘన సన్మానం.

తేది:26-12-2025 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా:ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బద్దం గోపి ఆధ్వర్యంలో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలు సాధించిన ముగ్గురు యువకులను ఘనంగా సన్మానించారు. గ్రూప్–2లో ఎంపికైన పెంతల నరేష్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా, గ్రూప్–3లో ఎంపికైన ఇట్టేడి ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌లో ఎంపికైన దిలారి విక్రమ్ నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో వ్యవసాయ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ యువత చదువుపై దృష్టి పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాంపల్లి రమేష్, నేమూరి సత్యనారాయణ, మాజీ కోఆప్షన్ మెంబర్ ఏలేటి చిన్నారెడ్డి, జెడి సుమన్, సుంకెం రాజశేఖర్, జింక శీను, ఓద్దే రాజు, జవాజి రాకేష్, విపుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *