


తేది:25-12-2025 TSLAWNEWS ములుగు జిల్లా ఇన్చార్జ్ పోరిక రాహుల్ నాయక్.
ములుగు జిల్లా: జనవరి నెలలో జరగబోయేటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను శరవేగంగా కొనసాగుతున్నాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్ర పంచాయతీల శాఖ మంత్రివర్యులు సీతక్క గారు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు,
శాశ్వత పనులు చేపట్టి కొన్ని రోజులు గడుస్తున్న పనులలో ఇంత వేగం పెంచడం పట్ల భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా జాతరపై ఇంత శ్రద్ధ చూపలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం పట్ల ఆదివాసి గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.