తేది:25-12-2025 మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ మల్లికార్జున్ బెస్త.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా:ఈ రోజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్, బాలాజీనగర్ లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈనెల 28 వ తేదీన TUJAC ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల గౌరవం, తెలంగాణనిరుద్యోగ కళాకారుల ధూమ్ ధామ్ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా TUJAC ఆర్గనైజింగ్ సెక్రటరీ డోలాక్ యాదగిరి, మరియు TUJAC రాష్ట్ర వైస్ చైర్మన్ వడ్డెర నర్సన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల గౌరవం ఇవ్వాలని, ప్రత్యేక తెలంగాణ లో ఉద్యమించినటువంటి వారు అనేక విధాలుగా నష్టపోయారని , కేసీఆర్ పాలనలో ఉన్న దొరల గడిలో నలిగిపోయిన బతుకులు ఎన్నో , ఇప్పుడు ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కారులకు ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని చెప్పి మరిచి మొద్దు నిద్రగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు,ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అందించాలని,250 గజాల ఇంటి స్థలం,పక్క ఇల్లు కట్టి ఇవ్వాలని,ప్రభుత్వమే ఉద్యమకారుల ను గుర్తించి గుర్తింపు కార్డు లు ఇవ్వాలని ఈ సందర్భంగా TUJAC చేస్తున్నటువంటి పోరాటం లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ ఉద్యమకారుల కు పిలుపు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో TUJAC కో చైర్మన్ గిరిపల్లి మల్లేశం,రాష్ట్ర నాయకులు గిద్దె శ్రీనివాస్ గౌడ్, ఎస్. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.