బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణను టీడీపీ చేతిలో పెట్టినట్టేనని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వర్గ నాయకులంతా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ బెటర్ అని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదేళ్ల పాటు పోరాడారని… ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని గుర్తు చేశారు.