తేది:25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్.
భూపాలపల్లి జిల్లా: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము
భద్రాచలం వారి వైకుంఠ ఏకాదశి అధ్యయ నోత్సవం వాల్ పోస్టర్ రామకోటి పుస్తకాలను శ్రీ రామదాసు భక్తి మండలి చెల్పూర్ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చిట్టప్రగడ శ్రీ ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఛీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆ సీతారాముల ఆశీస్సులతో అందరూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎస్ఈ లు మురళీమోహన్ రామ్ ముత్యాలరావు పాల్గొన్నారు శ్రీరామదాసు భక్తి మండలి భద్రాచలంలో జరిగే ఈ ఉత్సవాల కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సీఈ ఎస్ ఈలకు అందించారు.