

తేది:25-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా:జగిత్యాల మండలం అనంతారం, ధర్మపురి రోడ్డున గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి కొన్ని వేల లీటర్ల నీరు వృధాగా పోతున్న వార్త టీఎస్ లా న్యూస్ లో
వచ్చిన విషయం ప్రజలకు తెలిసిందే. అధిక డయామీటర్ గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పొలాస నుండి ధర్మపురి వైపు వెళ్లి ధర్మపురికి, పరిసర ప్రాంతాలకు వెళ్తుందని స్థానికులు తెలిపారు. ఈ సమాచారంను సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరారు. వెంటనే స్పందించిన అధికారులు పైప్ లైన్ మరమ్మతులు చేసి నీరు వృధా కాకుండా సక్రమంగా ప్రజలకు అందేలా చేశారని సంబంధించిన అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.