స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిని పరిగణలో తీసుకున్న సుప్రీంకోర్టు పునఃపరిశీలనకు అంగీకరించింది. నవంబర్ 28న వీటిపై విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయస్థానం తెలిపింది.