తేదీ 25-12-2025, TSLAWNEWS జనగామ జిల్లా,పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే ఉపేక్షించేది లేదు.
సేవ్ పాలకుర్తి ఫోరం బాధ్యులు గూడూరు లెనిన్, బండిపెల్లి మధు.
జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ పట్టణ కేంద్రంలోని గ్రామ పంచాయతీకి సంబంధించిన గల్లీలు, సందులు, కాలి నడకడ బాటలు కబ్జాలకు గురై అన్యాక్రాంతం అవుతున్నాయని వీటిపై వెంటనే గ్రామపంచాయతీ చర్యలు చేపట్టాలని సేవ్ పాలకుర్తి ఫోరం అధ్యక్షులు గూడూరు లెనిన్, కో-ఆర్డినేటర్ బండిపెల్లి మధు లు గ్రామ పంచాయతీ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్నగౌడ్, ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్ లకు ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. రాజీవ్ ఛౌరస్తాలోని సంతోషిమాత జ్యువెలరీ దుకాణం ఇంటి యజమాని మైస్కర్ వెంకన్న, తమ్మి మధు ల ఇంట మధ్య గల్లి (సందు) గ్రామ పంచాయితీ బాటగా బాటసారులకు అందుబాటులో ఉందని ఈ బాటను అక్రమంగా అతిక్రమించి, బాటసారులు నడవడానికి ఇబ్బంది కలిగిస్తూ ఇంటి యజమానులు మెట్ల నిర్మాణం చేపట్టారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ మెట్ల వలన బాటసారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ గ్రామ పంచాయతీ బాటకు మధ్యలో పుటపాత్ పైన మిర్చీ బండిని ఏర్పాటు చేయించి వారి వద్దనుండి సంవత్సరానికి లక్షల రూపాయలు కిరాయి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నామని అన్నారు. కాబట్టి ఇట్టి విషయం పై గ్రామపంచాయతీ అధికారికంగా చర్యలు తీసుకుని బాటసారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఫిర్యాదు లో పేర్కొన్నామని గూడూరు లెనిన్, బండిపెల్లి మధు లు తెలిపారు. ప్రభుత్వ భూములు, బాటలు, నాలాలు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అయితే ఉపేక్షించేది లేదని న్యాయ పోరాటాలకు సిద్ధమని వారు తెలిపారు.