
తేది:24-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లా:మెదక్ పట్టణంలోని చారిత్రక చర్చ్ వద్ద క్రిస్మస్ పండుగను శాంతియుతంగా, భద్రంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు ఈరోజు పరిశీలించారు.
ఈ సందర్భంగా చర్చ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, సీసీటీవీ కెమెరాల నిఘా వ్యవస్థలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.సందర్శకులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
క్రిస్మస్ వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా సాగేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని ఆయన తెలిపారు. అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.