హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై నటుడు మన్సూర్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ‘నేను వారంపాటు కత్తి లేకుండానే యుద్ధం చేశా. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణ చెబుతున్నా. ఇక్కడ నేను అహింసా మార్గంవైపే నిలబడ్డాను’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా మన్సూర్ క్షమాపణ తెలిపిన విధానం కూడా వివాదాస్పదమవుతోంది.