కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్ సమావేశాలు పెడుతున్నామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 27 నుంచి కుల గణన చేయాలనుకున్నాం.. కానీ, మరొకొద్ది రోజులు వాయిదా వేశామని చెప్పారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి కుల గణన చేస్తామని వెల్లడించారు. క్రింది స్థాయి నుండి వచ్చే అందరి సూచనలు తెలుసుకుంటున్నందున పది రోజులు ఆలస్యం అవుతోందని వివరించారు.