నిరుద్యోగుల తరపున కొల్లాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్లకు ఒక గన్మన్ భద్రత కల్పించాలని పోలీసు శాఖకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 21న సోదరుడిపై దాడి జరగడంతో తనకు 2+2 గన్మెన్లతో భద్రత కల్పించాలని బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.